స్థానిక సంస్థల ఎన్నికలకు ఎస్ఈసీ కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలి: సోము వీర్రాజు
- ఇంతకు ముందు జరిగిన మొత్తం ఎన్నికల ప్రక్రియను రద్దు చేయాలి
- రాష్ట్రంలో బంగారం కంటే ఇసుకే ఖరీదైపోయింది
- చంద్రబాబు హయాంలో అవినీతి ఉన్నా ఇసుక దొరికేది
లాక్ డౌన్ కు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని రద్దు చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. కొత్తగా నోటిషికేషన్ ను ఇచ్చి... మొత్తం ప్రక్రియను మళ్లీ నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నామని చెప్పారు. కడప జిల్లాలో 50 శాతానికి పైగా జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుందని... వీటన్నింటినీ రద్దు చేయాలని కోరారు. కడపలో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తిరుపతి ఉపఎన్నికలో బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఈ సందర్భంగా సోము వీర్రాజు చెప్పారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను ఆదుకోవడానికి కేంద్రం కృషి చేస్తోందని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో బంగారం కంటే ఇసుక ఖరీదైపోయిందని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో కొంత మేర అవినీతి జరిగినా ఇసుక దొరికేదని... ఇప్పుడు ఇసుక దొరకడమే గగనమైపోయిందని విమర్శించారు. ఇసుకపై త్వరలోనే ఉద్యమాన్ని చేపడతామని చెప్పారు.