వారాంతాన్ని లాభాల్లో ముగించిన మార్కెట్లు

  • 139 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 36 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 5 శాతానికి పైగా పెరిగిన ఓఎన్జీసీ షేరు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాల్లో ముగించాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ఒకానొక సమయంలో మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. చివర్లో మళ్లీ కొనుగోలు జోరు కొనసాగడంతో లాభాల్లోకి మళ్లాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 139 పాయింట్లు పెరిగి 46,099కి చేరింది. నిఫ్టీ 36 పాయింట్లు లాభపడి 13,514 వద్ద స్థిరపడింది.  

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఓఎన్జీసీ (5.68%), ఎన్టీపీసీ (5.30%), ఐటీసీ (1.65%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.63%), బజాజ్ ఆటో (1.11%).

టాప్ లూజర్స్:
యాక్సిస్ బ్యాంక్ (-2.19%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.04%), టెక్ మహీంద్రా (0.73%), ఏసియన్ పెయింట్స్ (-0.56%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.46%).


More Telugu News