ఇవిగో వాస్తవాలు... వీటిని విస్తృతంగా వ్యాప్తి చేయండి: జీవీఎల్
- ఇటీవల నూతన వ్యవసాయ చట్టాలు తెచ్చిన కేంద్రం
- తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతు సంఘాలు
- చర్చలు విఫలం
- కొన్ని శక్తులు దుష్ప్రచారం చేస్తున్నాయన్న జీవీఎల్
- పంటలు ఎక్కడైనా అమ్ముకోవచ్చని వెల్లడి
- స్వేచ్ఛా వాణిజ్యం అందుబాటులోకి వస్తుందని స్పష్టీకరణ
కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై నిరసనలు పెరిగిపోతుండడం పట్ల బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు స్వేచ్ఛా విపణి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా గిట్టుబాటు ధర లభించే ప్రాంతాల్లో అమ్ముకునే వెసులుబాటు కలుగుతుందని స్పష్టం చేశారు. అంతర్రాష్ట్ర, రాష్ట్రాల పరిధిలో వ్యవసాయ వాణిజ్యానికి హద్దులు చెరిగిపోతాయని, తమ పంట ఉత్పత్తులను అమ్ముకునే నిర్ణయాధికారం రైతులకే ఉంటుందని జీవీఎల్ వివరించారు.
ఈ వాస్తవాలను విస్తృతంగా వ్యాప్తి చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. దేశాభివృద్ధికి, శ్రమజీవులైన రైతులకు వ్యతిరేకంగా కొన్ని శక్తులు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కాగా, జాతీయ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు కొన్నివారాలుగా నిరసనలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. రైతులతో కేంద్రం పలు దఫాలుగా చర్చలు జరిపినా రైతు సంఘాలు సంతృప్తి చెందడంలేదు. చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి.