బిల్ గేట్స్ కు 'జీవితకాల సాఫల్య పురస్కారం'

  • గేట్స్ కు ప్రతిష్ఠాత్మక అవార్డు అందించిన టై గ్లోబల్
  • వర్చువల్ గా సాగిన కార్యక్రమంలో అవార్డు ప్రదానం
  • తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని గేట్స్ వెల్లడి
  • ప్రపంచ సవాళ్లను ఆవిష్కరణలతోనే ఎదుర్కోవాలని పిలుపు
  • పరిశోధకులకు సహకారం అవసరమని స్పష్టీకరణ
ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కు విశిష్ట గౌరవం లభించింది. 'టై గ్లోబల్' అనే సంస్థ బిల్ గేట్స్ కు 'జీవితకాల సాఫల్య పురస్కారం' అందించింది. వర్చువల్ గా జరిగిన ఓ కార్యక్రమంలో 'టై గ్లోబల్' ఈ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును గేట్స్ కు ప్రదానం చేసింది. ఈ సందర్భంగా బిల్ గేట్స్ రికార్డు చేసిన సందేశాన్ని కార్యక్రమంలో వినిపించారు. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన 'టై గ్లోబల్' అవార్డును అందుకోవడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని గేట్స్ తెలిపారు.

ప్రపంచం ఎదుర్కొంటున్న కఠినమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆవిష్కరణలే కీలకమని అన్నారు. కరోనా వంటి మహమ్మారిని ఎదుర్కొనడంలోనూ ఆవిష్కరణలే ప్రధానభూమిక పోషిస్తాయని అభిప్రాయపడ్డారు. అయితే ఆవిష్కర్తలు ప్రతిదీ సొంతంగా రూపొందించలేరు కనుక, భాగస్వాములు, మద్దతుదారుల సహకారం అవసరమని అభిప్రాయపడ్డారు. పరిశోధకులు ఆలోచనలు ప్రయోగశాల దాటి విపణికి చేరాలంటే ఎంతోమంది చేయూతనివ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.


More Telugu News