మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడి వాహనంపై వైసీపీ శ్రేణుల దాడి.. అద్దాలు ధ్వంసం!

  • మదనపల్లి సమీపంలో వాహనాలపై దాడి
  • తంబళ్లపల్లికి వెళ్తుండగా ఘటన
  • ధ్వంసమైన రెండు వాహనాలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు, చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనంపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి.

వివరాల్లోకి వెళ్తే తంబళ్లపల్లి పర్యటన నిమిత్తం రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డితో కలిసి కిషోర్ వెళ్తుండగా మదనపల్లి సమీపంలోని అంగళ్లు గ్రామం వద్ద వారి వాహనాలను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.

ఈ క్రమంలో టీడీపీ నేతల రెండు వాహనాలను వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. పోలీసులు రంగంలోకి దిగి కిషోర్ కు అడ్డుగా నిలబడటంతో, ఆయకు ఏమీ కాలేదు. ఈ ఘటనపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.


More Telugu News