యూపీఏ చైర్మన్‌గా శరద్ పవార్‌ను ప్రకటిస్తే మద్దతిస్తాం: శివసేన

  • కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనపడింది
  • యూపీఏ బాధ్యతలను స్వీకరించడానికి పవార్ సిద్ధంగా లేరని తెలిసింది
  • యూపీఏను బలపరచడానికి ప్రతిపక్షాలన్నీ ముందుకు రావాలి
దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై శివసేన నేత సంజయ్ రౌత్ విమర్శలు గుప్పించారు. ఈ విషయంపై మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనపడిందని ఆయన చెప్పారు. ఎన్డీఏను ఎదుర్కొనేందుకు దేశంలోని ప్రతిపక్షాలన్నీ కలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. యూపీఏ చైర్మన్‌గా ఎన్సీపీ నేత శరద్ పవార్ బాధ్యతలు స్వీకరిస్తే బాగానే ఉంటుందని ఆయన తెలిపారు.

అయితే, యూపీఏ బాధ్యతలను స్వీకరించడానికి పవార్ సిద్ధంగా లేరని తనకు తెలిసిందని చెప్పారు. ఆయన ఈ బాధ్యతలు చేపట్టాలన్న ఈ అభ్యర్థన అధికారికంగా వస్తే మాత్రం దానికి తమ పార్టీ మద్దతిస్తుందని చెప్పారు. దేశంలో యూపీఏను బలపరచడానికి ప్రతిపక్షాలన్నీ ముందుకు రావాలని, ఆ సమయం వచ్చిందని తెలిపారు.  

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు  సోనియాగాంధీ త్వరలోనే యూపీఏ చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో ఆమె శరద్ పవార్ పేరును ఆ పదవికి ప్రతిపాదించినట్లు వార్తలు వస్తున్నాయి.  తన స్థానంలో యూపీఏ చైర్మన్‌గా మరో నేతను ఎన్నుకోవాలని ఆమె సూచించినట్లు తెలుస్తోంది.


More Telugu News