అప్పులు చేస్తూ బూతులతో తప్పులను కప్పిపుచ్చుకోవాలనుకోవడం అసమర్థతకాదా?: దేవినేని ఉమ
- పౌర సరఫరాల శాఖను నిండా అప్పుల్లో ముంచారు
- ఏడాదిన్నరలో 16 వేల కోట్ల రూపాయల అప్పు
- మద్దతు ధరకు పంటలు కొనుగోలు చేయలేదు
- రైతులను దళారులపాలు చేశారు
ఆంధ్రప్రదేశ్‌లో పౌర సరఫరాల శాఖను నిండా అప్పుల్లో ముంచారని టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. ఈ మేరకు ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఓ కథనాన్ని ఆయన పోస్ట్ చేశారు.
‘పౌర సరఫరాల శాఖను నిండా అప్పుల్లో ముంచారు. ఏడాదిన్నరలో 16 వేల కోట్ల రూపాయల అప్పు చేశారు. మద్దతు ధరకు పంటలు కొనుగోలు చేయకుండా రైతులను దళారులపాలు చేశారు. రైతుల వద్ద కొన్న ధాన్యానికి 813 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించలేదు. మితిమీరిన అప్పులు చేస్తూ బూతులతో తప్పులను కప్పిపుచ్చుకోవాలనుకోవడం అసమర్థత కాదా వైఎస్ జగన్?’ అని అంటూ దేవినేని ఉమ ప్రశ్నించారు.