ఢాకా విమానాశ్రయం వద్ద కలకలం రేపిన 250 కిలోల బాంబు

  • విస్తరణ పనులు జరుగుతుండగా బయటపడిన బాంబు
  • 1971 యుద్ధ సమయంలో జారవిడిచి ఉండొచ్చన్న నిపుణులు
  • నిర్వీర్యం చేసిన బాంబ్ స్క్వాడ్
బంగ్లాదేశ్ రాజధాని ఢాకా విమానాశ్రయం వద్ద విస్తరణ పనులు జరుగుతుండగా బయటపడిన బాంబు కలకలం రేపింది. ఇక్కడి హజ్రత్ షాజ్‌లాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినళ్ల విస్తరణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా తవ్వకాలు జరుపుతుండగా సిలిండర్ ఆకారంలో ఉన్న 250 కిలోల బరువున్న బాంబు బయటపడింది. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న బాంబ్ స్క్వాడ్ దానిని జాగ్రత్తగా నిర్వీర్యం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 1971లో బంగ్లాదేశ్ విమోచన కోసం జరిగిన యుద్ధం సమయంలో ఈ బాంబును విడిచిపెట్టి ఉంటారని భావిస్తున్నారు.


More Telugu News