వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

  • ప్రభుత్వ అభ్యర్థనపై నేడు హైకోర్టులో విచారణ
  • రిజిస్ట్రేషన్లపై తాము స్టే ఇవ్వలేదని  స్పష్టీకరణ
  • స్లాట్ బుకింగ్ విధానానికి సమ్మతి
  • ఆస్తి పన్ను గుర్తింపు సంఖ్య తప్పనిసరి అని పేర్కొన్న సర్కారు
  • అందుకు కూడా ఓకే చెప్పిన న్యాయస్థానం
తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఆపాలని తాము ఎప్పుడూ స్టే ఇవ్వలేదని హైకోర్టు స్పష్టం చేసింది. వ్యవసాయేతర ఆస్తులను గతంలో మాదిరే కంప్యూటర్ ఆధారిత విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర సర్కారు అభ్యర్థనపై నేడు హైకోర్టు విచారణ చేపట్టింది. ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం ముందుగానే స్లాట్ బుక్ చేసుకునే విధానానికి న్యాయస్థానం సమ్మతించింది. అంతేకాదు, ఆస్తి పన్ను గుర్తింపు సంఖ్య కచ్చితంగా ఉండాలన్న ప్రభుత్వ నిబంధనకు కూడా పచ్చజెండా ఊపింది. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ... రిజిస్ట్రేషన్ సమయంలో కులం, ఆధార్, కుటుంబ సభ్యుల వివరాలు అడగబోమని కోర్టుకు స్పష్టం చేశారు.


More Telugu News