చిన్న కంపెనీలను తొక్కేస్తోందంటూ ఫేస్ బుక్ పై అమెరికా ఆగ్రహం
- గతంలో ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ లను చేజిక్కించుకున్న ఫేస్ బుక్
- ఫేస్ బుక్ పై దావాలు వేసిన అమెరికా సర్కారు, 48 రాష్ట్రాలు
- ఇలాగే వదిలేస్తే చిన్న సంస్థలకు మనుగడ ఉండదని వెల్లడి
- పోటీ లేకుండా చేసుకుంటోందని ఆరోపణలు
- ఫేస్ బుక్ ను నియంత్రించాలని కోర్టులకు విజ్ఞప్తి
ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ పై సొంతదేశం అమెరికాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చిన్న సంస్థలు తనకు పోటీగా వస్తాయనుకుంటే వాటిని డబ్బు ఆశ చూపించి కొనుగోలు చేస్తోందని, తనకు ఎదురులేకుండా చేసుకునేందుకు ఓ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోందని ఫేస్ బుక్ ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా, వాణిజ్య నిబంధనలను అతిక్రమిస్తూ చిన్న సంస్థలను అణగదొక్కుతోందంటూ అమెరికా ప్రభుత్వంతో పాటు 48 రాష్ట్రాలు ఫేస్ బుక్ పై కోర్టులను ఆశ్రయించాయి.
దీనిపై అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ స్పందిస్తూ, తనకు గట్టి ప్రత్యర్థి అవుతుందని భావించి 2012లో ఇన్ స్టాగ్రామ్ ను కొనేసిందని, ఇదే ఆలోచనతో 2014లో వాట్సాప్ ను చేజిక్కించుకుందని ఫేస్ బుక్ ను నిందించింది. ఫేస్ బుక్ అనుసరిస్తున్న వైఖరితో పోటీతత్వం మాయమవుతోందని, తద్వారా యూజర్ల ముందు ఐచ్ఛికాలు తగ్గిపోతున్నాయని ఫేడరల్ ట్రేడ్ కమిషన్ పేర్కొంది. ఫేస్ బుక్ ను అడ్డుకోకపోతే చిన్న సంస్థల మనుగడకు ముప్పు తప్పదని, ఫేస్ బుక్ పై ఆంక్షలు విధించడం ద్వారా పోటీని పునరుద్ధరించాలని న్యాయస్థానాన్ని కోరింది.
ఈ మేరకు అమెరికా ట్రేడ్ ఫెడరల్ కమిషన్ తో పాటు 48 రాష్ట్రాల అటార్నీ జనరళ్లు కోర్టులో దావాలు వేశారు. ఫేస్ బుక్ చర్యలు అనైతికమని కోర్టులు భావిస్తే గనుక... ఈ సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ లపై తన హక్కులను వదులుకోవాల్సి రావొచ్చు.