కొత్త పార్లమెంటు భవనానికి భూమిపూజ చేసిన ప్రధాని మోదీ
- వేదమంత్రోచ్చారణ మధ్య భూమి పూజ కార్యక్రమం
- కార్యక్రమానికి హాజరైన పలువురు కేంద్ర మంత్రులు
- 64,500 చదరపు మీటర్ల వైశాల్యంలో పార్లమెంటు భవనం
ఢిల్లీలోని సంసద్ మార్గ్ లో నూతన పార్లమెంటు భవన సముదాయానికి ప్రధాని మోదీ భూమిపూజను నిర్వహించారు. వేద పండితులు వేదమంత్రోచ్చారణ చేస్తుండగా ఆయన భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లతో పాలు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు.
త్రిభుజాకారంలో నిర్మించనున్న ఈ భవనంలో ఐదు ఫ్లోర్లు ఉంటాయి. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూ. 971కోట్ల వ్యయంతో భవనాన్ని నిర్మిస్తున్నారు. లోక్ సభకు ఆనుకుని ప్రధాని కార్యాలయం ఉంటుంది. 2022 ఆగస్టు నాటికి ఈ భవనం పూర్తి కానుంది. వందేళ్ల అవసరాలకు సరిపడేలా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు.