దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయంలో కల్వకుంట్ల కవిత పూజలు
- రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని కోరుకున్న కవిత
- ప్రభుత్వం రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకుంటుందని వ్యాఖ్య
- ఆలయానికి వచ్చిన ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ను ఆలయ కమిటీకి అందజేత
హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ రోజు ఉదయం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని తాను సాయిబాబాను కోరుకున్నానని చెప్పుకొచ్చారు. గుడికి వచ్చే భక్తులకు వసతుల కల్పనతో పాటు ప్రసాదానికి సంబంధించి ఇటీవల సాయిబాబా ఆలయానికి వచ్చిన ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ను ఆలయ కమిటీకి ఆమె అందజేశారు.
ఆలయానికి ఈ ఐఎస్‌ఓ సర్టిఫికెట్ రావడం గొప్ప విషయమని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఆమెతో పాటు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పలువురు టీఆర్‌ఎస్ నేతలు కూడా గుడికి వచ్చారు.
కాగా, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన కల్వకుంట్ల కవిత నిన్న కొండస్వామి ఆలయంలో మొక్కు చెల్లించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత విజయాన్ని సాధించాలని కోరుకుంటూ అప్పట్లో జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలోని జగ్గాసాగర్ గ్రామశివారులో ఉన్న కొండస్వామి ఆలయంలో టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు పుల్ల జగన్‌గౌడ్ అప్పట్లో ముడుపు కట్టడంతో ఆమె నిన్న ఆ ఆలయానికి వెళ్లారు. ఆ ముడుపు విప్పి మొక్కు చెల్లించుకున్నారు.