‘ఏషియా సెలబ్రిటీస్ ఇన్ ది వరల్డ్’ జాబితాలో సోనూసూద్‌కు అగ్ర స్థానం
- లాక్‌డౌన్‌లో పేదలకు సాయం చేసిన సోనూసూద్
- బ్రిటన్‌కు చెందిన మ్యాగజైన్ ఈస్టర్న్ ఐ సర్వేలో నం.1
- టాప్- 50 ఏషియన్ సెలబ్రిటీల లిస్ట్ విడుదల
కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌లో పేదలకు సాయం చేసి మంచి పేరు తెచ్చుకున్న సినీనటుడు సోనూసూద్ ఆ తర్వాత కూడా తన సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. బ్రిటన్‌కు చెందిన మ్యాగజైన్ ఈస్టర్న్ ఐ నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం తేలింది.
టాప్- 50 ఏషియన్ సెలబ్రిటీల్లో గ్లోబల్ 2020 లిస్ట్‌ను ఈస్టర్న్ ఐ విడుదల చేసింది. ‘ఏషియా సెలబ్రిటీస్ ఇన్ ది వరల్డ్’ జాబితాలో సోనూసూద్ అగ్ర స్థానంలో నిలిచారు. కరోనా సంక్షోభ సమయంలో పేదలను ఆదుకున్నందుకు సెలబ్రిటీలందరినీ పరిశీలించి ఈ జాబితాను విడుదల చేశారు.
వారందరిలోనూ సోనూసూదే అగ్రస్థానంలో నిలిచారు. దీనిపై సోనుసూద్ స్పందించారు. తన ప్రయత్నాలను గుర్తించినందుకు ఈస్టర్న్ ఐ పత్రికకు థ్యాంక్స్ చెప్పారు. కరోనా సమయంలో తాను తన బాధ్యతగా తన దేశ పౌరులకు అండగా నిలబడ్డానని, దేశ ప్రజలు తనపై చూపించిన ప్రేమ, ఆప్యాయతలను మర్చిపోలేనని తెలిపారు. తన సేవా కార్యక్రమాలను తన చివరి శ్వాస ఉన్నంత వరకు ఆపబోనని తెలిపారు. ఈ జాబితాలో టాలీవుడ్ హీరో ప్రభాస్ ఏడో స్థానంలో నిలిచారు.