భారత్-చైనా సంబంధాలు దెబ్బతిన్నాయి: విదేశాంగ మంత్రి జైశంకర్

  • సైన్యం మోహరింపుపై చైనా పొంతనలేని సమాధానాలు
  • తిరిగి సాధారణ పరిస్థితులు కష్టమే
  • గల్వాన్ ఘటనతో దేశ ప్రజల సెంటిమెంటులో మార్పు
గత మూడునాలుగు దశాబ్దాలతో పోల్చుకుంటే ప్రస్తుతం భారత్, చైనా మధ్య సంబంధాలు దారుణంగా ఉన్నాయని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన లోఈ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన ఆన్‌లైన్ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

సరిహద్దు వెంబడి చైనా వేల సంఖ్యలో సైన్యాన్ని మోహరించిందని, ఇదేంటని ప్రశ్నిస్తే ఐదు పొంతన లేని సమాధానాలు ఇచ్చిందని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమనేది చాలా పెద్ద విషయమన్నారు. గల్వాన్ ఘటన చైనాపై భారత్‌లో వ్యతిరేకతకు కారణమైందని అన్నారు. ఈ ఘటన దేశ ప్రజల సెంటిమెంట్‌లో మార్పు తీసుకొచ్చిందని జైశంకర్ పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాది జూన్‌లో జరిగిన గల్వాన్ ఘర్షణలో భారత్ కు చెందిన 20 మంది సైనికులు అమరులయ్యారు.


More Telugu News