ఎలాంటి అలర్జీలు ఉన్నా వ్యాక్సిన్ తీసుకోవద్దు: ప్రజలకు బ్రిటన్ హెచ్చరిక
- వ్యాక్సిన్ తీసుకున్న వారిలో సమస్యలు
- ఇద్దరిలో దద్దుర్లు, రక్త ప్రసరణ సమస్యలు
- మెడికల్ హిస్టరీ చూడాలని ఆదేశాలు
బ్రిటన్ లో కరోనాను తరిమికొట్టేందుకు వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కాగానే, సమస్యలు రావడంతో బ్రిటన్ ప్రభుత్వం తన కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న ఇద్దరు నేషనల్ హెల్త్ సర్వీస్ కు చెందిన వారికి తీవ్ర అస్వస్థత ఏర్పడింది. 24 గంటల వ్యవధిలో ఒళ్లంతా దద్దుర్లు, రక్త ప్రసరణలో తేడాలు రావడంతో, బ్రిటన్ ఔషధ నియంత్రణా సంస్థ అలర్ట్ అయింది.
గతంలో ఏవైనా మందులుకానీ, ప్రత్యేకమైన ఆహారం కానీ తీసుకుంటే అలర్జీ వచ్చే వారు కరోనా టీకాను తీసుకోవద్దని ప్రభుత్వం అధికారికంగా హెచ్చరికలు జారీ చేసింది. ఆపై వ్యాక్సినేషన్ కోసం వచ్చే వారి మెడికల్ హిస్టరీని పరిశీలించాలని, అలర్జీలు ఏమైనా ఉంటే వారికి టీకాను ఇవ్వద్దంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా, కొత్తగా వచ్చే వ్యాక్సిన్లు తీసుకునే వారిలో సైడ్ ఎఫెక్టులు రావడం చాలా సహజమని, దీని గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదని దుష్ప్రభావాలు కనిపించిన ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలూ కోలుకుంటున్నారని అధికారులు వెల్లడించారు.