నేడు సిద్దిపేటకు కేసీఆర్.. రూ.870 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన

  • 144 మంది డబుల్ బెడ్రూం లబ్ధిదారులతో సామూహిక గృహప్రవేశాలు
  • సిద్దిపేటలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం
  • వెయ్యి పడకల ఆసుపత్రికి శంకుస్థాపన
  • భారీ బహిరంగ సభ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ. 870 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ముఖ్యంగా నర్సాపూర్ శివారులో నిర్మించిన 2,461 డబుల్ బెడ్రూం ఇళ్లలో మొదటి దశలో భాగంగా 144 మంది లబ్ధిదారులతో నేడు సామూహిక గృహ ప్రవేశాలు చేయించనున్నారు. 9వ బ్లాక్‌లోని 3వ నంబరు నివాస గృహంలో లబ్ధిదారుడితో కేసీఆర్ దగ్గరుండి గృహప్రవేశం చేయిస్తారు.

అలాగే, పొన్నాల శివారులో నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట జిల్లా కార్యాలయాన్ని సీఎం ప్రారంభిస్తారు. మెడికల్‌ కళాశాల, రంగనాయకసాగర్‌ అతిథిగృహం, సిద్దిపేటలో మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్, రైతు వేదికలను ప్రారంభిస్తారు. వెయ్యి పడకల ఆసుపత్రి, ఐటీ టవర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు.


More Telugu News