ఆ సామర్థ్యం భారత్ కు మాత్రమే ఉంది!: ఆస్ట్రేలియా రాయబారి ఫారెల్ ప్రశంసలు

  • హైదరాబాదులో పర్యటించిన 64 దేశాల రాయబారులు
  • భారత్ బయోటెక్, బయొలాజికల్ ఈ లిమిటెడ్ సందర్శన
  • ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ అందించే సామర్థ్యం భారత్ కే ఉందన్న ఫారెల్
64 దేశాలకు చెందిన రాయబారులు, హైకమిషనర్లు ఈరోజు హైదరాబాదులో పర్యటించారు. ప్రముఖ ఫార్మా కంపెనీలైన భారత్ బయోటెక్, బయొలాజికల్-ఈ లిమిటెడ్ కంపెనీలను వారు సందర్శించారు. కరోనా వ్యాక్సిన్ తయారీకి సంబంధించి జరుగుతున్న ప్రయత్నాలను తెలుసుకున్నారు.

ఆస్ట్రేలియా రాయబారి బారీ ఓ ఫారెల్ భారత్ బయోటెక్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ బయోటెక్ లో కోవాక్సిన్ పేరుతో వ్యాక్సిన్ అభివృద్ధి చేయబడుతోందని చెప్పారు. పలు దేశాల్లో అనేక వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నారని, కానీ, ప్రతి దేశంలోని పౌరులకు అందించే స్థాయిలో వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేయడం ఒక్క భారత్ కు మాత్రమే సాధ్యమని చెప్పారు. ఆ సామర్థ్యం భారత్ కు మాత్రమే ఉందని అన్నారు.


More Telugu News