పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య ఆరోగ్య పరిస్థితి విషమం

  • ఊపిరి తీసుకోవడంలో తలెత్తిన ఇబ్బందులు
  • క్రిటికల్ కేర్ యూనిట్ లో ఉన్న మాజీ సీఎం
  • శరీరం చికిత్సకు స్పందిస్తోందన్న వైద్యులు
పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఊపిరి తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తడంతో ఆయనను హుటాహుటిన కోల్ కతాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. కరోనా పరీక్షల్లో మాత్రం ఆయనకు నెగెటివ్ వచ్చింది. కానీ, ఆయన కండిషన్ క్రిటికల్ గానే ఉన్నట్టు అధికారులు తెలిపారు.

76 ఏళ్ల భట్టాచార్య ప్రస్తుతం క్రిటికల్ కేర్ యూనిట్ లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆసుపత్రికి చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పారు. అయితే, కరోనా నెగెటివ్ రావడం ఒక గుడ్ న్యూస్ అని అన్నారు. ఆయన శరీరం చికిత్సకు స్పందిస్తోందని చెప్పారు. బీపీ, పల్స్ రేటు సాధారణంగా ఉన్నాయని తెలిపారు. వృద్ధాప్య సంబంధిత రుగ్మతలతో ఆయన బాధపడుతున్నారని చెప్పారు.


More Telugu News