బీజేపీ ప్రభుత్వం వస్తే ముఖ్యమంత్రి ఎవరు అవుతారో చెప్పలేం: సోము వీర్రాజు
- జగన్, చంద్రబాబులకు పోలవరంపైనే ఆసక్తి
- రాయలసీమ ప్రాజెక్టులపై ఆసక్తి లేదు
- ఏపీలో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ, జనసేనే
ఏపీ ముఖ్యమంత్రి జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబులపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. వీరిద్దరికి పోలవరం ప్రాజెక్టుపై ఉన్న చిత్తశుద్ధి, ఆసక్తి రాయలసీమ ప్రాజెక్టులపై లేదని అన్నారు. రాయలసీమ ప్రజలపై వీరిద్దరూ సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని మండిపడ్డారు.
2024లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టు మాదిరే రాయలసీమ ప్రాజెక్టులకు కూడా అత్యంత ప్రాధాన్యతను ఇస్తామని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం వస్తే ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే విషయాన్ని చెప్పలేమని అన్నారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ, జనసేనే అని చెప్పారు. తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని అన్నారు.