బీసీ ఉద్యమం చివరి దశకు చేరుకుంది... ఏ పార్టీని వదిలిపెట్టం: ఆర్.కృష్ణయ్య
- ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా బీసీలకు సీఎం పదవి ఇవ్వలేదు
- 2,500 బీసీ కులాలు ఇంత వరకు పార్లమెంటులో అడుగుపెట్టలేదు
- తెలంగాణ ఉద్యమం కంటే బీసీ ఉద్యమాన్ని ఎక్కువ చేస్తాం
బీసీ ఉద్యమం చివరి దశకు చేరుకుందని బీసీ సంఘాల నేత ఆర్.కృష్ణయ్య అన్నారు. ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా బీసీలకు సీఎం పదవిని ఇవ్వలేదని విమర్శించారు. రాజ్యాధికారంలో బీసీలకు వాటా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. అడిగితే వచ్చేది బిచ్చం, పోరాడితే వచ్చేది అధికారమని అన్నారు. బీసీలకు రాజ్యాధికారం వచ్చేంత వరకు ఏ పార్టీని, ఏ ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మన దేశంలో ఉన్న 2,500 కులాలు ఇంత వరకు పార్లమెంటులో అడుగే పెట్టలేదని కృష్ణయ్య అన్నారు. 74 ఏళ్ల స్వతంత్ర భారతంలో 14 శాతానికి మించి బీసీలు రాజకీయ ప్రాతినిధ్యాన్ని సాధించలేకపోయాయని చెప్పారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే తిరుగుబాటు వస్తుందని అన్నారు. రాజ్యాధికారం కోసం అగ్గి మండిస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమం కంటే బీసీ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. పది లక్షల మందితో హైదరాబాదును అష్ట దిగ్బంధనం చేస్తామని అన్నారు.