ఏపీలో గ్రామ వాలంటీర్లను తొలగిస్తున్నారంటూ వస్తున్న వార్తలను ఖండించిన ప్రభుత్వం.. ఏమాత్రం వాస్తవం లేదని వివరణ!
- ప్రతి నెల వాలంటీర్ల ఖాళీల భర్తీ
- ప్రతి నెల 1 నుంచి 16 మధ్య ఖాళీల భర్తీ
- ప్రస్తుతం ఖాళీగా ఉన్న 7,120 పోస్టులు
35 ఏళ్లు నిండిన వాలంటీర్లను ప్రభుత్వం తొలగిస్తోందంటూ కొన్ని పత్రికల్లో వస్తున్న వార్తలను ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ శాఖ కమిషనర్ నవీన్ కుమార్ ఖండించారు. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఆరుగురు ఎంపికయ్యారని... వీరిని తొలగించడానికి చేపట్టిన చర్యలపై తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలిపారు. వీరిని తప్ప మరెవరినీ తొలగించడం లేదని అన్నారు.
ఇక ఖాళీగా ఉన్న గ్రామ, వార్డు వాలంటీర్ల పోస్టుల భర్తీని ఎప్పటికప్పుడు ప్రతి నెలా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నెల 1వ తేదీ నుంచి 16వ తేదీల మధ్య జిల్లాల పరిధిలో ఉండే వాలంటీర్ల ఖాళీల భర్తీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు నవీన్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు తమ పరిధిలో ఏర్పడే ఖాళీల వివరాలను ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్ల దృష్టికి తీసుకురావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2.60 లక్షల మంది వాలంటీర్లు పని చేస్తుండగా... 7,120 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 5,154 గ్రామ వాలంటీర్ పోస్టులు ఉన్నాయి.