ఈ ఆకాంక్ష సోనియా గాంధీ గారి నిబద్ధత వల్ల నెరవేరింది: రేవంత్ రెడ్డి
- తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేసిన శుభప్రదమైన రోజు ఇది
- తెలంగాణ ఎప్పటికీ ఆమెను గుర్తు చేసుకుంటూనే ఉంటుంది
- ఆమె ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో జీవించాలి
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి సానుకూలంగా గత యూపీఏ ప్రభుత్వం ప్రకటన చేసిన డిసెంబరు 9ని గుర్తు చేసుకుంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష ప్రతిఫలించిన రోజున తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేసిన శుభప్రదమైన రోజు ఇది. ఆ ఆకాంక్ష శ్రీమతి సోనియా గాంధీ గారి నిబద్ధత వల్ల నెరవేరింది. తెలంగాణ ఎప్పటికీ ఆమెను గుర్తు చేసుకుంటూనే ఉంటుంది. ఆమె ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో జీవించాలని తెలంగాణ ప్రజలతో పాటు నేను కోరుకుంటున్నాను’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
కాగా, 2009లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తారస్థాయికి చేరడంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అప్పటి యూపీఏ సర్కారు డిసెంబరు 9న పార్లమెంటులో అధికారికంగా ప్రకటించింది. అప్పటి నుంచి సంప్రదింపులు ప్రారంభమయ్యాయి. అనంతరం అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరకు 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది.