ఇది దేశంలో రాబోయే కాలుష్య ప్రమాదాలకు ముందు సూచిక: ఏలూరులో వింత వ్యాధిపై ఐవైఆర్
- ఏలూరులో ప్రజలకు వింత వ్యాధి
- కూరగాయల సాగులో వాడే రసాయనాలు, పాల కల్తీయే కారణమని అనుమానాలు
- విచక్షణారహితంగా రసాయనాలు వాడుతున్నారు
ఏలూరులో ప్రజలకు వస్తున్న వింత వ్యాధికి కూరగాయల సాగులో వాడే రసాయనాలు, పాల కల్తీయే కారణమని అనుమానాలు వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. ఢిల్లీ ఎయిమ్స్‌కి పంపించిన శాంపిళ్ల మలివిడత పరీక్షల్లోనూ ఇదే విషయం తేలిందని ఈనాడులో వచ్చిన ఓ కథనాన్ని పోస్ట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు విమర్శలు గుప్పించారు. బాధితుల నుంచి సేకరించిన రక్త నమూనాలలో అత్యధికంగా లెడ్ (సీసం), నికెల్ ఎక్కువ మోతాదులో ఉందనే విషయాన్ని కనుగొన్న విషయంపై ఆయన తన అభిప్రాయాలు తెలిపారు.
‘కూరగాయల సాగులో రసాయనాలు, పాల కల్తీ ఏలూరు వ్యాధికి కారణాలు అయితే ఇది దేశంలో రాబోయే కాలుష్య ప్రమాదాలకు ముందు సూచిక. విచక్షణారహితంగా ఈ రోజు వాడుతున్న రసాయనాలు, కలుపు నివారణ మందులు, వీటితో పాటు నియంత్రణ లేని రసాయనిక ఫార్మా కంపెనీల వ్యర్థాలతో ప్రజారోగ్యానికి పెను ప్రమాదమే పొంచి ఉన్నది’ అని ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు.