ఫోర్బ్స్ జాబితాలో పలువురు భారత మహిళలకు స్థానం!

  • టాప్ 100 శక్తిమంతమైన వనితల జాబితా విడుదల
  • తొలి స్థానంలో జర్మనీ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ 
  • నిర్మలా సీతారామన్, కిరణ్ మజుందార్, రోష్మీ నాడార్ లకు చోటు
ప్రముఖ బిజినెస్ మేగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచపు అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో పలువురు భారతీయ వనితలకు స్థానం లభించింది. మొత్తం 100 మంది పేర్లతో ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితా తొలి స్థానంలో జర్మనీ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ కు నిలిచారు. ఆపై రెండో స్థానంలో యూరప్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ క్రిస్టిన్ లగార్డే నిలిచారు.

ఇక ఇండియాకు చెందిన వారిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా, టెక్ దిగ్గజం హెచ్సీఎల్ సీఈఓ రోష్నీ నాడార్ తదితరులకు స్థానం లభించింది. ఈ జాబితాలో అమెరికాకు కాబోయే వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ కూ స్థానం దక్కింది.

10 దేశాలకు చెందిన ఉన్నత పదవుల్లో ఉన్నవారు, 38 కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ లు, ఎంటర్ టెయిన్ మెంట్ విభాగంలో ఉన్న ఐదుగురు మహిళలను ఫోర్స్బ్ తన జాబితాలో శక్తిమంతులుగా పేర్కొంది.


More Telugu News