ట్విట్టర్లో రికార్డు కొట్టిన విజయ్ నైవేలీ సెల్ఫీ!
- విజయ్ నైవేలీలో షూటింగులో ఉండగా ఐటీ పిలుపు
- రెండు రోజుల పాటు విచారించిన ఐటీ అధికారులు
- నైవేలీ చేరుకున్న వేలాది అభిమానులు
- ఫిబ్రవరి 10న వారితో సెల్ఫీ దిగిన విజయ్
- ఎక్కువ రీట్వీట్లు పొందిన సెల్ఫీగా రికార్డు
ఈవేళ సినిమా తారలకు సంబంధించిన కొత్త విషయం ఏదైనా ఉందంటే వెంటనే అది సోషల్ మీడియాలో వైరల్ అయిపోయి, కొత్త రికార్డులు సృష్టిస్తోంది. అందులోనూ అది సూపర్ స్టార్లకు సంబంధించినది అయితే, చెప్పేక్కర్లేదు. రికార్డులే రికార్డులు! తాజాగా తమిళ సూపర్ స్టార్ విజయ్ కు సంబంధించిన సెల్ఫీ ఫొటో ఒకటి అలాగే వైరల్ అయి, ట్విట్టర్ ట్రెండ్ అయింది.
తమిళనాట విజయ్ కున్న పాప్యులారిటీ అంతాఇంతా కాదు. రజనీకాంత్ తర్వాత ఎక్కువ ఫాలోయింగ్ వున్నది ఇతనికే. అందుకే, విజయ్ కొత్త సినిమాల రిలీజ్ రోజున తమిళనాడు రాష్ట్రమంతటా సందడి కనిపిస్తుంది. అలాంటి విజయ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో నైవేలిలో 'మాస్టర్' సినిమా షూటింగులో ఉండగా ఆదాయపు పన్ను అధికారులు తీసుకెళ్లి రెండు రోజుల పాటు విచారించారు. 'బిగిల్' సినిమాకు సంబంధించిన ఆదాయం విషయంలో అవకతవకలున్నాయంటూ ఆయనను విచారించారు.
ఈ విషయం తెలుసుకున్న విజయ్ అభిమానులు ఆందోళనతో వేలాదిగా నైవేలీలోని షూటింగ్ స్పాట్ కి చేరుకున్నారు. ఆదాయపు పన్ను అధికారుల విచారణ తర్వాత ఫిబ్రవరి 10న షూటింగ్ స్పాట్ కి చేరుకున్న విజయ్ ఈ సందర్బంగా ఆ అశేష అభిమాన జన సందోహం నడుమ సెల్ఫీ తీసుకుని, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
దీనిని అభిమానులు విపరీతంగా షేర్ చేస్తూ, ఒక లక్ష 45 వేల రీట్వీట్లు చేశారు. దీంతో రీట్వీట్ల పరంగా ఇదొక రికార్డు అయింది. ఇక ట్విట్టర్ 'దిస్ హ్యపెండ్ 2020' పేరిట సింహావలోకనం చేస్తూ, ఈ ఏడాది అత్యధిక రీట్వీట్ పొందిన ఫొటోగా దీనికి గౌరవాన్ని ఆపాదించింది. దీంతో విజయ్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ విధంగా విజయ్ మరోసారి వార్తల్లో నిలిచాడు!