భారత్ తో ఉద్రిక్తతలను తగ్గించేందుకు చర్చలు జరుపుతున్నాం: చైనా

  • ప్రతిష్టంభన తొలగిపోయేందుకు చర్చలు కొనసాగిస్తున్నామన్న చైనా
  • సమస్య పరిష్కారానికి ఇరు దేశాలు కృషి చేస్తున్నాయని వ్యాఖ్య
  • ఏకాభిప్రాయాలు కుదిరిన తర్వాత తదుపరి విధివిధానాలు ఉంటాయన్న డ్రాగన్ దేశం
భారత్-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు తీయని కబుర్లు చెపుతూనే మరోవైపు రెచ్చగొట్టే విధంగా చైనా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఉన్నత స్థాయిలో పలు సమావేశాలు జరిగినా ఇంత వరకు సమస్యకు పరిష్కారం లభించలేదు.

ఈ నేపథ్యంలో చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి హువా చున్ యింగ్ మాట్లాడుతూ, ప్రతిష్టంభన తొలగిపోయేలా ఇండియాతో చర్చలను కొనసాగిస్తున్నామని చెప్పారు. ఇరు దేశాల మధ్య దౌత్యపరంగానే కాకుండా, మిలిటరీ ఉన్నతాధికారుల స్థాయి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. బోర్డర్ సమస్యలను చక్కదిద్దేందుకు ఇరు దేశాలు కృషి చేస్తున్నాయని చెప్పారు. ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయాలు కుదిరిన తర్వాత వాటి అమలుపై తదుపరి విధివిధానాలు ఉంటాయని తెలిపారు.


More Telugu News