ఏపీలో డిసెంబరు 21న 'శాశ్వత భూ హక్కు-భూ రక్ష పథకం' ప్రారంభం

  • ఏపీలో భారీ సర్వేకు రంగం సిద్ధం
  • భూ హక్కు-భూ రక్ష పథకంపై సీఎం జగన్ సమీక్ష
  • రాష్ట్రవ్యాప్తంగా 17,460 గ్రామాల పరిధిలో సర్వే
  • 1.26 లక్షల చదరపు కిమీ మేర సర్వే
  • సర్వే ఆఫ్ ఇండియాతో ఏపీ సర్కారు ఒప్పందం
రాష్ట్రంలో భారీ సర్వేకు రంగం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష పథకంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్ష సమావేశానికి రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. శాశ్వత భూ హక్కు-భూ రక్ష పథకాన్ని డిసెంబరు 21న ప్రారంభించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఇందులో భాగంగా 17,460 గ్రామాల పరిధిలో 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల మేర భూ సర్వే జరగనుంది. ఈ భారీ సర్వే కోసం ఏపీ ప్రభుత్వం సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది.


More Telugu News