ఏలూరులో తగ్గుముఖం పడుతున్న వింత వ్యాధి!
- సంచలనం సృష్టించిన వింతవ్యాధి
- ఈ నెల 5 నుంచి ఏలూరులో వింతవ్యాధి కలకలం
- ఇప్పటివరకు 550 కేసులు నమోదు
- నేడు కేవలం 50 కేసులు నమోదు
- ఊపిరి పీల్చుకుంటున్న అధికారులు
గత కొన్నిరోజులుగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రజలు అర్థంకాని వింతజబ్బుతో సతమతమవుతున్నారు. ఎయిమ్స్ నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ వరకు అన్ని ప్రధాన వైద్య సంస్థలు ఏలూరుపై దృష్టి సారించాయంటే ఈ ఘటన తీవ్రత అర్థమవుతుంది. ఇప్పటివరకు 550 మంది బాధితులు లెక్కతేలారు. అయితే, గత రెండ్రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రులకు వందల సంఖ్యలో బాధితులు తరలిరాగా, నేడు కేవలం 50 కేసులు నమోదయ్యాయి. అటు బాధితుల నుంచి ప్రభుత్వ కాల్ సెంటర్లకు వస్తున్న కాల్స్ సంఖ్య కూడా తగ్గిపోయింది.
ఏలూరులో ఈ వింత వ్యాధి వ్యాప్తి ఈ నెల 5న మొదలైంది. ఆ రోజున 83 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఆ తర్వాత వరుసగా రెండ్రోజుల పాటు భారీ సంఖ్యలో కేసులు పోటెత్తాయి. దాంతో ఏలూరు గగ్గోలెత్తిపోయింది. అయితే ఇవాళ తక్కువ సంఖ్యలో కేసులు రావడంతో అధికార వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి.