ముఖేశ్ అంబానీ ప్రకటనతో లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • వచ్చే ఏడాది 5జీ నెట్ వర్క్ ను అందుబాటులోకి తెస్తామన్న ముఖేశ్
  • 152 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 37 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే లాభాల్లోకి వెళ్లిన మార్కెట్లు ఆ తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం తర్వాత మళ్లీ పుంజుకున్నాయి.

2021 ద్వితీయార్థంలోకల్లా దేశంలో 5జీ నెట్ వర్క్ ను అందుబాటులోకి తీసుకొస్తామని రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ చేసిన ప్రకటనతో మార్కెట్లు మళ్లీ లాభాల్లోకి మళ్లాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 152 పాయింట్లు లాభపడి 45,609కి చేరుకుంది. నిఫ్టీ 37 పాయింట్లు పెరిగి 13,393 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (3.00%), టీసీఎస్ (2.23%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.73%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.98%), ఇన్ఫోసిస్ (0.83%).

టాప్ లూజర్స్:
సన్ ఫార్మా (-2.18%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.82%), ఎన్టీపీసీ (-1.70%), టెక్ మహీంద్రా (-1.40%), ఓఎన్జీసీ (-1.36%).


More Telugu News