ఎవరెస్ట్ శిఖరం తాజా ఎత్తును ప్రకటించిన నేపాల్

  • 2015లో హిమాలయ సానువుల్లో భూకంపం
  • ఎవరెస్ట్ ఎత్తు తగ్గి ఉంటుందని అంచనాలు
  • చైనా సాయం కోరిన నేపాల్
  • ఎవరెస్ట్ ఎత్తు కొలించేందుకు సహకరించిన చైనా
  • ఎవరెస్ట్ ఎత్తుపై సవరణ ప్రకటన చేసిన నేపాల్
ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తయిన శిఖరం ఎవరెస్ట్. హిమాలయాల్లో ఉన్న ఎవరెస్ట్ శిఖరం తాజా ఎత్తును నేపాల్ ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. 2015 భూకంపం తర్వాత ఎవరెస్ట్ పర్వతం ఎత్తు తగ్గి ఉంటుందని అంచనా వేశారు.

ఈ నేపథ్యంలో ఎవరెస్ట్ ఎత్తును కొలిచేందుకు నేపాల్ సర్కారు చైనా సాయం తీసుకుంది. చైనా సహకారంతో నిర్మించిన సర్వేల ద్వారా ఎవరెస్ట్ ఎత్తులో ఎలాంటి తరుగుదల చోటుచేసుకోలేదని వెల్లడైంది. ఎవరెస్ట్ శిఖరం ఎత్తు 8,848.86 మీటర్లు అని నేపాల్ ప్రభుత్వం తాజా ప్రకటనలో స్పష్టం చేసింది.

అయితే, 1954లో అప్పటి భారత ప్రభుత్వం జరిపిన సర్వేలో ఎవరెస్ట్ ఎత్తు 8,848 మీటర్లు కాగా, నేపాల్ తాజా ప్రకటనలో 86 సెంమీ మేర ఎత్తు పెరిగినట్టు వెల్లడైంది.


More Telugu News