స్టీఫెన్ రవీంద్ర మంచి అధికారి.. ఏపీకి ఆయన వస్తారని నేను అనుకోను: వర్ల రామయ్య
- పోలీస్ వ్యవస్థలో రవీంద్ర ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు
- అవినీతి కేసుల్లో ముద్దాయైన సీఎం ఉన్న రాష్ట్రానికి ఆయన వస్తారనుకోను
- విచారణ ముందుకు సాగకుండా ముద్దాయిలు యత్నిస్తున్నారు
రాష్ట్ర విభజన తర్వాత సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన సంగతి తెలిసిందే. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను రాష్ట్రానికి ఇంటెలిజెన్స్ చీఫ్ గా తీసుకెళ్లాలని సీఎం జగన్ యత్నించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసిన విన్నపాన్ని కేంద్ర హోంశాఖ అంగీకరించలేదు. అయితే ఆయనను రాష్ట్రానికి రప్పించేందుకు ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఈ అంశంపై టీడీపీ నేత వర్ల రామయ్య ట్విట్టర్ ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టీఫెన్ రవీంద్ర ఒక మంచి పోలీస్ అధికారి అని ఆయన కితాబిచ్చారు. పోలీస్ వ్యవస్థలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆయన సంపాదించుకున్నారని... అలాంటి ఉన్నతమైన ఒక అధికారి పలు అవినీతి కేసుల్లో ముద్దాయిగా ఉన్న ముఖ్యమంత్రి పాలిస్తున్న రాష్ట్రానికి ఇంటెలిజెన్స్ చీఫ్ గా వస్తారని, ఆయన తెలిసిన వ్యక్తిగా తాను భావించడం లేదని అన్నారు.
ఒక మంచి ఉద్దేశంతో రాజకీయ నాయకులపై ఉన్న కేసుల విచారణను త్వరతగతిన పూర్తి చేయాలని సుప్రీంకోర్టు చర్యలు చేపట్టిందని వర్ల చెప్పారు. అయితే విచారణ ముందుకు సాగకుండా ముద్దాయిలు ప్రయత్నిస్తున్నారని... డిశ్చార్జి పిటిషన్లు, ఇతర విచారణలో జాప్యం జరిగేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సత్వర విచారణకు ఈ అవినీతి రాజకీయ నాయకులు సహకరించాలని అన్నారు.