విపరీతంగా పెరిగిపోతున్న సైబర్ క్రైమ్... రూ.73 లక్షల కోట్ల మేర హ్యాకర్ల పాలు!
- ఆసక్తికర సర్వే చేపట్టిన మెకాఫీ
- సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ సంస్థతో అధ్యయనం
- 2018 నాటి నష్టానికి రెట్టింపైన మొత్తం నష్టం
- ప్రపంచ జీడీపీ కంటే ఒక్కశాతం ఎక్కువని గుర్తింపు
- సైబర్ దాడులతో 92 శాతం కంపెనీలు విలవిల
ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ మెకాఫీ, సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ సంస్థతో కలిసి నిర్వహించిన సర్వేలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచంలో నానాటికీ పెరిగిపోతున్న సైబర్ క్రైమ్ ద్వారా రూ.73 లక్షల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టు గుర్తించారు. 2018 నాటి నష్టంతో పోలిస్తే 50 శాతం పెరిగినట్టు వెల్లడైంది. ప్రపంచ జీడీపీతో పోల్చితే ఇది ఒక్కశాతం ఎక్కువ. అంతేకాదు, సైబర్ క్రైమ్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా 92 శాతం కంపెనీలు ద్రవ్య నష్టాలను మించిన దుష్ఫలితాలను చవిచూశాయి.
నూతన సాంకేతికతలు అందుబాటులోకి వచ్చేకొద్దీ వ్యాపారాలపై సైబర్ దాడుల ఉద్ధృతి మరింత పెరుగుతోందని మెకాఫీ వర్గాలు తెలిపాయి. సైబర్ దాడులపై ప్రభుత్వాలకు, సంస్థలు అప్రమత్తంగా ఉన్నప్పటికీ, మరింత అవగాహన అవసరం అన్న విషయం మరోసారి నిరూపితమైందని మెకాఫీ సీటీఓ స్టీవ్ గ్రాబ్ మన్ వెల్లడించారు. అంతేకాదు, ఓ సైబర్ దాడి జరిగిన వెంటనే ఆర్థికనష్టంతో పాటు అనేక పనిగంటలు కూడా కోల్పోవాల్సి వస్తుందని, సంస్థ ఉత్పాదకతపై ఈ విధంగా కూడా ప్రభావం పడుతోందని మెకాఫీ సర్వేలో వెల్లడైంది.