2004కి ముందు జగన్ ఆస్తి ఎంత?.. ఇప్పుడు ఎంత?: వర్ల రామయ్య

  • తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించారు
  • అమరావతిని తరలించే శక్తి జగన్ కు లేదు
  • సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది
మూడు రాజధానులను ప్రకటించడం ముఖ్యమంత్రి జగన్ అనాలోచిన నిర్ణయమని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. అమరావతిని తరలించే శక్తి జగన్ కు లేదని చెప్పారు. అమరావతి రైతులు ఉద్యమాన్ని ప్రారంభించి ఏడాది కావస్తున్నా జగన్ పట్టించుకోవడం లేదని విమర్శించారు.

జగన్ నిర్ణయాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన సీఎం జగన్ అని అన్నారు. తండ్రి వైయస్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్లాది రూపాయలు సంపాదించారని చెప్పారు. 2004కి ముందు జగన్ ఆస్తి ఎంత? ఇప్పుడు ఆయన ఆస్తి ఎంత? అని ప్రశ్నించారు.

అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలని వర్ల అన్నారు. జగన్ సీఎం అయిన ఏడాదిన్నరలో రాష్ట్రం అప్పులపాలు అయిందని చెప్పారు. వరుస తుపాన్లతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని... వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని చెప్పారు.


More Telugu News