ఏపీ కరోనా అప్ డేట్: రాష్ట్రంలో మరింతగా దిగొచ్చిన కొత్త కేసులు
- గత 24 గంటల్లో 43,006 కరోనా పరీక్షలు
- 316 మందికి పాజిటివ్
- అత్యధికంగా గుంటూరు జిల్లాలో 87 కేసులు
- అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 3 కేసులు
- యాక్టివ్ కేసుల సంఖ్య 5,626
ఏపీలో కరోనా మహమ్మారి కట్టడికి తీసుకుంటున్న నియంత్రణ చర్యలు ఫలితాలనిస్తున్నాయి. గడచిన కొన్నిరోజులుగా వెల్లడవుతున్న కొత్త కేసుల సంఖ్యలో తగ్గుదలే అందుకు నిదర్శనం. గత 24 గంటల్లో కరోనా వ్యాప్తి మరింతగా తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా 43,006 కరోనా పరీక్షలు నిర్వహించగా, 316 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 87 కేసులు వెలుగు చూడగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 3 కొత్త కేసులు వచ్చాయి. కర్నూలు జిల్లాలో 4, అనంతపురం, ప్రకాశం జిల్లాలో 9 కేసుల చొప్పున గుర్తించారు.
అదే సమయంలో 595 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఐదుగురు మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 7,038కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,72,288 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,59,624 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 5,626 మందికి చికిత్స జరుగుతోంది.