ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భారత్ బంద్: రాకేశ్ టికాయత్
- కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రేపు భారత్ బంద్
- ప్రజలకు ఇబ్బంది కలిగించబోమన్న కిసాన్ యూనియన్
- అంబులెన్స్ లను అడ్డుకోబోమని ప్రకటన
కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రేపు భారత్ బంద్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమాన్ని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే నిర్వహిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయత్ ప్రకటించారు. సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది కలగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
బంద్ ప్రారంభమయ్యే 11 గంటల లోపు అందరూ వారి కార్యాలయాలకు వెళ్లొచ్చని... 3 గంటలకు బంద్ ముగిసిన తర్వాత ఇళ్లకు చేరుకోవచ్చని టికాయత్ తెలిపారు. అంబులెన్స్ లను అడ్డుకోబోమని చెప్పారు. పెళ్లిళ్లు జరుపుకోవచ్చని అన్నారు. కేవలం తమ నిరసనను వ్యక్తం చేయడానికి మాత్రమే బంద్ చేపడుతున్నామని, శాంతియుతంగా బంద్ కొనసాగుతుందని చెప్పారు. కొత్త వ్యవసాయ చట్టాలు తమకు సమ్మతం కాదనే విషయాన్ని చెప్పడానికే బంద్ చేపడుతున్నామని తెలిపారు.