స్పైడర్‌మన్‌లా 58 అంతస్తుల భవనాన్ని ఎక్కిన యువకుడు.. వీడియో ఇదిగో

  • పారిస్‌లో యువకుడి సాహసం
  • నిజమైన స్పైడర్‌మన్ అంటోన్న నెటిజన్లు
  • భద్రతా సామాగ్రి వాడకుండా చేతులతోనే ఎక్కిన వైనం
స్పైడర్‌మన్‌లా ఓ వ్యక్తి 58 అంతస్తుల భవవాన్ని ఎక్కి అందరి దృష్టినీ ఆకర్షించాడు. దీంతో నిజమైన స్పైడర్‌మన్ అతడేనంటూ నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆ అపార్ట్‌మెంటును లియో అర్బన్ అనే యువకుడు ఎక్కుతుండగా తీసిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఎలాంటి భద్రతా సామాగ్రి వాడకుండా చేతులతోనే పారిస్‌ మోంట్‌పార్నాస్సేలోని భవనాన్ని అతను ఎక్కాడు. కేవలం గంటలోపే అంత ఎత్తైన భవనాన్ని ఎక్కి ఔరా అనిపించాడు.

పారిస్‌లో 210 మీటర్ల ఎత్తైన ఈ భవనంపైకి ఎక్కిన విషయానికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ సాహసం చేయడానికి ముందు తాను కొన్ని వారాల నుంచి ప్రాక్టీస్‌ చేస్తున్నానని తెలిపాడు. తన జీవితంలో అత్యంత క్లిష్టమైన సాహసం ఇదేనని అన్నాడు‌. గతంలోనూ అతను ఇటువంటి సాహసాలు ఎన్నో చేశాడు. ఈఫిల్ టవర్, టూర్‌ టీ1ను ఎక్కాడు.


More Telugu News