తన నివాసం వద్దే దీక్ష ప్రారంభించిన పవన్ కల్యాణ్!

  • పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్
  • తక్షణ సాయంగా రూ.10,000 ఇవ్వాలన్న పవన్
  • ఏపీలోని కలెక్టరేట్ల ఎదుట జనసేన నేతల దీక్షలు
నివర్ తుపాను కారణంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ రైతులు తీవ్రంగా పంటలు నష్టపోయిన విషయం తెలిసిందే. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలు ప్రాంతాల్లో పర్యటించి, రైతులను పరామర్శించి, వారికి జరిగిన నష్ట వివరాలను పవన్ తెలుసుకున్నారు. ప్రజలను ఆదుకునే విషయంలో వైసీపీ ప్రభుత్వం స్పందించకపోతే దీక్ష చేపడతానని ఇప్పటికే ప్రకటించారు.

ఈ క్రమంలో బాధితులకు పదివేల రూపాయల ఆర్థిక సాయం తక్షణం అందించాలంటూ ఈ రోజు దీక్షకు దిగారు. తన నివాసంలో పవన్ ఈ దీక్షను చేపట్టారు. నష్ట పరిహారంగా రూ.35 వేల రూపాయలు, తక్షణ సాయంగా రూ. 10,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క, ఏపీలోని కలెక్టరేట్ల ఎదుట జనసేన నేతలు, కార్యకర్తలు కూడా నిరసన దీక్షలకు దిగారు. గుంటూరు కలెక్టరేట్ ఎదుట జనసేన నేతలు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదె వెంకటేశ్వరరావు  దీక్షలో పాల్గొన్నారు.


More Telugu News