ఏలూరులో 345కు చేరిన వింత వ్యాధి బాధితుల సంఖ్య.. ఆసుపత్రిలో రోగులతో మాట్లాడిన ముఖ్యమంత్రి

  • తాడేపల్లి నివాసం నుంచి ఏలూరుకు జగన్
  • ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా
  • కాసేపట్లో జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కొందరు ఉన్నట్లుండి అస్వస్థతకు గురవుతోన్న ఘటన అలజడి రేపుతోన్న విషయం తెలిసిందే. ఆ ప్రాంతంలో వెలుగులోకి వస్తోన్న ఈ వ్యాధి బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం నుంచి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చేరుకున్నారు. ఏలూరులో అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తున్నారు.

బాధితులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.  కాసేపట్లో జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కాగా, మూర్ఛ, కళ్లుతిరగడం, నోట్లో నురగ వంటి లక్షణాలతో మరికొంత మంది ఈ రోజు ఆసుపత్రుల్లో చేరారు. ఇప్పటివరకు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్న మొత్తం బాధితుల సంఖ్య 345కు చేరుకుంది.


More Telugu News