రైతులకు ఏం సమాధానం చెబుతారు?: దేవినేని ఉమ

  • ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతిన్న అన్నదాత వెన్నువిరుస్తారా? 
  • సాకులు చెబుతూ మద్దతు ధర ఇవ్వట్లేదు
  • ధాన్యం బస్తాకు రూ.472 తగ్గిస్తారా?
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విధానాలు, ప్రకృతి వైపరీత్యాలూ అన్నదాతకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఓ కథనాన్ని పోస్ట్ చేస్తూ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు. ప్రకృతి వైపరీత్యాలు రైతులను సగం దెబ్బ తీస్తే, పాలకుల విధానాలు, వ్యాపారుల దోపిడీ మరింత నష్టానికి గురిచేస్తున్నాయని అందులో పేర్కొన్నారు.

గ్రేడ్‌-ఏ ధాన్యం 75 కిలోల బస్తాకు రూ.1416 మద్దతు ధర చెల్లించాల్సి ఉందని, అయితే, ధాన్యంలో తేమ, మట్టి, మొలక శాతాలను సాకుగా చూపిస్తూ బస్తాకు రూ.1,050 నుంచి రూ.1,100కు తగ్గించి, కొనుగోలు చేస్తున్నారని అందులో వివరించారు. ఈ విషయాలను దేవినేని ఉమ ప్రస్తావించారు.

‘ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతిన్న అన్నదాత వెన్నువిరుస్తారా? సాకులు చెబుతూ మద్దతుధర ఇవ్వకుండా ధాన్యం బస్తాకు రూ.472 తగ్గిస్తారా? అసమర్థ విధానాలతో బీమా ప్రీమియం చెల్లించకుండా, నష్ట పరిహారం ఇవ్వకుండా, పంటను కొనుగోలు చేయకుండా ఎందుకు నట్టేట ముంచారంటున్న రైతులకు ఏం సమాధానం చెబుతారు? వైఎస్ జగన్’ అని దేవినేని ఉమ ప్రశ్నించారు.


More Telugu News