దేశంలో 96,77,203కు చేరిన కరోనా కేసుల సంఖ్య
- 24 గంటల్లో 32,981 మందికి కరోనా
- మృతుల సంఖ్య 1,40,573
- కోలుకున్న వారు 91,39,901 మంది
- యాక్టివ్ కేసులు 3,96,729
భారత్లో కరోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం.. గత 24 గంటల్లో 32,981 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 96,77,203కి చేరింది. ఇక గత 24 గంటల్లో 39,109 మంది కోలుకున్నారు.
గడచిన 24 గంటల సమయంలో 391 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,40,573కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 91,39,901 మంది కోలుకున్నారు. 3,96,729 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది.
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 14,77,87,656 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 8,01,081 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.