‘రామన్ ఎఫెక్ట్’తో కరోనా నిర్ధారణ: ఐఐఎస్‌సీ

  • వైరస్‌ను గుర్తించేందుకు సరికొత్త విధానంవైపు ఐఐఎస్‌సీ శాస్త్రవేత్తల దృష్టి
  • ఆర్ఎన్ఏను వేరు చేయాల్సిన అవసరం లేకుండానే వైరస్ గుర్తింపు
  • రామన్ ఎఫెక్ట్‌కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
కరోనా నిర్ధారణ పరీక్షలను వేగవంతం చేసేందుకు ప్రఖ్యాత భారత శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి విజేత సర్ సీవీ ‘రామన్ ఎఫెక్ట్‌’ను ఉపయోగించాలని బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) పేర్కొంది. ఈ ఎఫెక్ట్‌ను ఉపయోగించడం ద్వారా కరోనా పరీక్షలను వేగవంతం చేయొచ్చని భావిస్తోంది. కరోనా అనుమానితుల బ్లడ్ ప్లాస్మా నమూనాలోని వైరస్ జాడను కనుగొనేందుకు రామన్ స్పెకోట్రెస్కోపీని ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.

రామన్ ఎఫెక్ట్‌కు కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను జోడించి పూర్తి కచ్చితత్వంతో వేగంగా, అత్యంత చవకగా కరోనా పరీక్షలు చేసే దిశగా ప్రయోగాలు ప్రారంభించినట్టు పేర్కొన్నారు. ఈ విధానంలో నమూనాల నుంచి ఆర్ఎన్ఏను వేరు చేయాల్సిన అవసరం ఉండదని తెలిపారు. కాగా, ద్రవాలపై పడిన కాంతి కిరణాలు ఎలా చెదిరిపోతాయో తెలిపే పరిశోధన ఫలితాన్నే రామన్ ఎఫెక్ట్ అంటారు. రామన్ కనుగొన్న ఈ సూత్రం ‘రామన్ ఎఫెక్ట్’గా ప్రాచుర్యంలోకి వచ్చింది. 1930లో ఈ ‘రామన్ ఎఫెక్ట్’కు నోబెల్ బహుమతి లభించింది.


More Telugu News