అమిత్ షాను కలిసిన తెలంగాణ తొలి మహిళా పైలట్.. బీజేపీలో చేరిక!

  • పసుపు రంగు చీరతో కనిపించిన మహిళ గురించి ఆసక్తి
  • ఆమె తెలంగాణ తొలి మహిళా  పైలట్ అజ్మీరా బాబీగా గుర్తింపు
  • నేడు విజయశాంతితో కలిసి బీజేపీలో చేరిక
నిన్న సినీనటి విజయశాంతి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలిసిన వేళ, అక్కడే పసుపు రంగు చీరలో ఉన్న మరో మహిళపై అందరి దృష్టీ పడింది. ఆమె చాలా మందికి పెద్దగా పరిచయం లేకపోవడంతో, నెట్టింట ఎవరన్న చర్చ కూడా సాగింది. ఇక ఆమె తెలంగాణలో తొలి మహిళా పైలట్ గా గుర్తింపు తెచ్చుకున్న అజ్మీరా బాబీగా గుర్తించారు.

మంచిర్యాలకు చెందిన అజ్మీరా హరిరాం నాయక్, జయశ్రీ దంపతులకు జన్మించిన బాబీ, ఎంబీయే తరువాత విమానయాన రంగంపై ఉన్న ఆసక్తితో తొలుత ఎయిర్ హోస్టెస్ గా పనిచేశారు. ఆ తరువాత పైలట్ కావాలన్న కోరికను నెరవేర్చుకునేందుకు శిక్షణ పొంది, తెలంగాణలో తొలి మహిళా పైలట్ గా గుర్తింపు పొందారు. ఇప్పుడు రాజకీయాల వైపు నడుస్తున్నారు. నేడు విజయశాంతితో పాటు అజ్మీరా బాబీ కూడా బీజేపీలో చేరనున్నారని తెలుస్తోంది.


More Telugu News