ఆందోళన చేస్తున్న రైతులకు బాక్సర్ విజేందర్ సింగ్ మద్దతు.. పతకం వెనక్కి ఇచ్చేస్తానని హెచ్చరిక
- రైతుల ఆందోళనలో పాల్గొన్న విజేందర్
- వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్
- సాహిత్య అకాడమీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తానన్న నవలా రచయిత
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన రైతులకు ప్రముఖ బాక్సర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత విజేందర్ సింగ్ మద్దతు పలికాడు. నిన్న రైతు ఉద్యమంలో పాల్గొన్న ఆయన.. నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాడు. లేదంటే ప్రభుత్వం తనకు ఇచ్చిన రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డును తిరిగి ఇచ్చేస్తానని హెచ్చరించాడు.
తాను పంజాబ్‌లోనే క్రీడా శిక్షణ పొందానని, తనకు అన్నం పెడుతున్న రైతులు గడ్డకట్టే చలిలో ఆందోళన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. వారి సోదరుడిగా మద్దతు ప్రకటించడానికి వచ్చానని విజేందర్ పేర్కొన్నాడు. చాలామంది క్రీడాకారులు హర్యానాలో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తుండడంతో రైతులకు మద్దతు ఇస్తున్నప్పటికీ ఆందోళనల్లో పాల్గొనలేకపోతున్నారని వివరించాడు.
రైతుల ఆందోళనకు మద్దతు తెలిపిన ప్రముఖ నవలా రచయిత డాక్టర్ జస్విందర్ సింగ్ కేంద్రం తనకు ఇచ్చిన సాహిత్య అకాడమీ అవార్డును వెనక్కి ఇచ్చేశారు. కాగా, ఒలింపిక్ పతక విజేతలైన 30 మంది క్రీడాకారులు రైతుల ఆందోళనకు మద్దతు ఇవ్వనున్నట్టు బాస్కెట్ బాల్ మాజీ ఆటగాడు సజ్జన్ సింగ్ తెలిపారు.