ట్రంప్ న్యాయవాదికి కరోనా.. స్వీయ నిర్బంధంలోకి రూడీ
- ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న రూడీ కుమారుడు
- ఎన్నికల్లో అక్రమాలు వెలికి తీస్తూ వైరస్ బారినపడ్డారన్న ట్రంప్
- ట్రంప్ చుట్టూ ఉన్న వారు కరోనా బారినపడుతున్నారన్న సలహాదారు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది రూడీ గియులియాని కరోనా బారినపడ్డారు. దీంతో ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. రూడీకి కరోనా సోకడంపై ట్రంప్ స్పందించారు. న్యూయార్క్ మేయర్‌గా పనిచేసిన రూడీ అమెరికా ఎన్నికల్లో జరిగిన అక్రమాల వెలికితీత కోసం పోరాడుతూ వైరస్ బారినపడినట్టు ట్రంప్ పేర్కొన్నారు.
కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్, ఆయన భార్య మెలానియా, కుమారుడు డొనాల్డ్ జూనియర్, ఆయన కుమారుడు బారన్, ప్రెస్ సెక్రటరీ, సలహాదారులు, ప్రచార నిర్వాహకులు వైరస్ బారినపడ్డారు. కాగా, ఇటీవల రూడీ కుమారుడు ఆండ్రూ కూడా వైరస్ బారినపడి కోలుకున్నారు. ట్రంప్ చుట్టూ ఉన్నవారు వరుసపెట్టి కరోనా బారినపడుతున్నారని సీనియర్ సలహాదారు డేవిడ్ గెర్డెన్ తెలిపారు.