ఇది ఓ సైకో కిల్లర్ అంతరంగం!
- గురుగ్రామ్ లో వరుస హత్యలు
- మూడు రోజుల్లో ముగ్గుర్ని చంపిన సైకో కిల్లర్
- మద్యం ఆశ చూపి మర్డర్లు చేసిన మహ్మద్ రాజీ
- తలొక చోట, మొండెం మరొక చోట
- సవాల్ గా తీసుకుని కేసును ఛేదించిన గురుగ్రామ్ పోలీసులు
ఇటీవల గురుగ్రామ్ పోలీసులు మహ్మద్ రాజీ అనే యువకుడ్ని అరెస్ట్ చేశారు. మహ్మద్ రాజీ సాధారణ హంతకుడు కాదు... వరుసగా మూడు రాత్రుల్లో ముగ్గుర్ని పొట్టనబెట్టుకున్న ప్రమాదకర సైకో కిల్లర్. రాజీ గురుగ్రామ్ లో గత నెల 23 నుంచి 25వ తేదీ వరకు రోజుకు ఒకర్ని చొప్పున గొంతుకోసి చంపేశాడు. మద్యం ఆశ చూపించి వారిని ఆకర్షించి ఆపై హతమార్చడం రాజీ స్టయిల్.
తల ఒకచోట, మొండెం మరో చోట ఉంటుండడంతో పోలీసులకే ఈ హత్యలు ఎవరు చేస్తున్నారో అర్థంకాలేదు. వరుస హత్యలతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు కలిగాయి. ఈ హత్యలు సంచలనం సృష్టించడంతో పోలీసులు ఈ కేసును ఓ సవాల్ గా తీసుకుని ఛేదించారు. సీసీ టీవీ ఫుటేజి ఆధారంగా మహ్మద్ రాజీని అరెస్ట్ చేశారు. ఇంటరాగేషన్ లో అతడు చెప్పిన వివరాలు అతడి మానసిక ఉన్మాదాన్ని చాటేలా ఉన్నాయి.
బాల్యం నుంచి తనకు లోకజ్ఞానం తక్కువ అని, తాను బలహీనంగా ఉన్నానని, ఎందుకు పనికిరానివాడ్నని అందరూ ఎగతాళి చేసేవారని రాజీ పోలీసులకు తెలిపాడు. అయితే, తాను ఏంచేయగలనో అందరికీ తెలిసేలా చేసేందుకు ఇలా హత్యలకు పాల్పడుతున్నానని వెల్లడించాడు. అయితే, మనుషుల గొంతు కోస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుందని, వారు ఆ విధంగా చనిపోతుంటే బాగా ఆస్వాదించేవాడ్నని తెలిపాడు. అతడి మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
కాగా, ఉన్మాద హంతకుడు ఢిల్లీ, బీహార్ లోనూ హత్యలకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంతజేసీ మహ్మద్ రాజీ వయసు 22 సంవత్సరాలు మాత్రమే. అతడు బీహార్ కు చెందినవాడు. చిన్నవయసులోనే సైకోగా మారడం పట్ల పోలీసులు సైతం విస్మయానికి గురవుతున్నారు.