ఉద్ధండరాయునిపాలెంలో రాళ్లదాడి... దీక్షాశిబిరం వద్ద ఉద్రిక్తత
- ఇంటింటా అమరావతి నిర్వహిస్తున్న రాజధాని మహిళలు
- అడ్డుకున్న మూడు రాజధానుల మద్దతదారులు
- ఇరు వర్గాల మధ్య ఘర్షణ
- ఈ క్రమంలోనే రాళ్ల దాడి
- దీక్ష శిబిరంలో ఇద్దరు మహిళలకు గాయాలు
అమరావతి ప్రాంతంలోని ఉద్ధండరాయునిపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజధాని అమరావతిలోనే ఉండాలంటూ ఉద్యమిస్తున్న వారికి, మూడు రాజధానులకు మద్దతు ఇస్తున్నవారికి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇంటింటా అమరావతి కార్యక్రమం నిర్వహిస్తున్న మహిళలను మూడు రాజధానులకు మద్దతు ఇస్తున్న బృందం అడ్డుకుంది.
దాంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరగడంతో రాళ్ల దాడి చోటుచేసుకుంది. దాంతో ఉద్ధండరాయునిపాలెంలో నిర్వహిస్తున్న దీక్షాశిబిరంలో ఉన్న మహిళలకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఉద్రిక్తతలు మరింత పెరగకుండా చర్యలు తీసుకున్నారు. ఘర్షణలు విస్తరించకుండా పోలీసులు భారీగా మోహరించారు.