ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం... ఏపీలో ఓ మోస్తరు వర్షాలు

  • ఏపీకి మరోసారి వర్షసూచన
  • రానున్న రెండ్రోజుల పాటు వర్షాలు
  • ఉత్తరాంధ్ర మినహా మిగతా జిల్లాల్లో వర్షాలు
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న విపత్తుల శాఖ
ఏపీకి మరోసారి వర్ష సూచన జారీ అయింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీలో రానున్న రెండు రోజుల పాటు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కృష్ణా, కర్నూలు, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వివరించారు.

ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల శాఖ హెచ్చరించింది. కాగా, బురేవి తుపాను ప్రభావంతో నిన్నటి వరకు కూడా ఏపీ దక్షిణ కోస్తా జిల్లాల్లో వానలు కురిశాయి. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో గణనీయమైన స్థాయిలో వర్షపాతం నమోదైంది.


More Telugu News