వింత రోగం వచ్చింది ఏలూరు ప్రజలకు కాదు.... వైఎస్ జగన్ కి: నారా లోకేశ్ వ్యాఖ్యలు

  • ఏలూరులో అస్వస్థతకు గురవుతున్న ప్రజలు
  • భారీగా ఆసుపత్రులకు తరలివస్తున్న వైనం
  • ప్రభుత్వమే దుష్ప్రచారం చేస్తోందన్న లోకేశ్
  • లోపాన్ని ప్రజలపైకి నెడుతున్నారని ఆరోపణ
  • ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని హితవు
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రజలు విచిత్రమైన వ్యాధికి గురై ఆసుపత్రులకు క్యూలు కడుతుండడంపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు. తమ చేతగానితనం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో ఏలూరులో వచ్చింది వింత రోగం అని, మాస్ హిస్టీరియా అని ప్రభుత్వమే ప్రచారం చేస్తోందని ఆరోపించారు. వింత రోగం వచ్చింది ప్రజలకు కాదు, వైఎస్ జగన్ కి అని లోకేశ్ విమర్శించారు.

నీటిలో లోపం లేదు, గాలిలో లోపం లేదు, మాకు ఓటేసిన ప్రజల్లోనే లోపం ఉందని వైద్యశాఖ మంత్రి అనడం దారుణమని పేర్కొన్నారు. పారిశుద్ధ్య లోపాన్ని ప్రజలపైకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పూర్తిస్థాయిలో ల్యాబ్ రిపోర్టులు రాకుండానే నీరు కలుషితం కాలేదు అంటూ ప్రకటనలు ఇవ్వడం మానుకుని, మరింత మంది ప్రజలు అస్వస్థతకు గురికాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు.


More Telugu News