ఆ 'సంతకం' సంగతేంటో చూస్తే జార్జియాలో నేను గెలిచినట్టే: ట్రంప్

  • అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ కే ఆధిక్యత
  • ఇప్పటికీ తనకు అవకాశాలున్నాయంటున్న ట్రంప్
  • సంతకాల ధృవీకరణకు అనుమతించాలంటూ డిమాండ్
  • జార్జియాలో గెలిస్తే పరిస్థితులు చక్కబడతాయంటూ ట్వీట్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ కు స్పష్టమైన ఆధిక్యం వచ్చినా, తనకింకా గెలిచే అవకాశాలున్నాయని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నమ్ముతున్నారు. దీనిపై ఆయన మరోసారి ఎలుగెత్తారు. ఓ చిన్న సంతకం ధృవీకరణకు గవర్నర్ బ్రయాన్ కెంప్ గానీ, మంత్రి గానీ అనుమతిస్తే జార్జియాలో నేను చాలా సులువుగా, సత్వరమే గెలుస్తాను అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు.

"అలా జరగలేదో... చాలా తేడాలు వస్తాయి... మరి ఎందుకు ఈ ఇద్దరు రిపబ్లికన్లు సంతకాల ధృవీకరణకు అంగీకరించడంలేదు? జార్జియాలో మేం గెలిస్తే అన్నీ దేనికవే చక్కబడతాయి. మిగతా ఫలితాలు కూడా గాడిన పడతాయి" అంటూ వ్యాఖ్యానించారు.


More Telugu News