అందుకే ఏలూరులో ప్రజలు ఒక్కసారిగా మూర్చ లక్షణాలతో పడిపోయారు: లోకేశ్

  • ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఘటన
  • 150 మంది అస్వస్థతకు గురయ్యారు
  • అందులో అధిక సంఖ్యలో చిన్నారులు  
  • కలుషిత తాగునీరు కారణమని ప్రాథమిక సమాచారం
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కొందరు ఉన్నట్లుండి అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. దీన్ని ప్రస్తావిస్తూ  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. ఈ ఘటనకు కలుషిత తాగునీరు కారణమని ప్రాథమిక సమాచారం అందిందని చెప్పారు.

‘ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రజలు ఒక్కసారిగా మూర్చ లక్షణాలతో పడిపోయారు, 150 మంది అస్వస్థతకు గురయ్యారు. అందులో అధిక సంఖ్యలో చిన్నారులు ఉన్నారు. వైద్య శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనే ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ లేదు’ అని లోకేశ్ విమర్శలు గుప్పించారు.

‘ఇక రాష్ట్రంలో ఉన్న మిగిలిన ప్రాంతాల పరిస్థితి తలచుకుంటేనే ఆందోళనగా ఉంది. వెంటనే అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలి. చిన్నారుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కలుషిత తాగునీరు కారణమని ప్రాథమిక సమాచారం. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి’ అని లోకేశ్ చెప్పారు.


More Telugu News